NTV Telugu Site icon

Yashwant Varma: యశ్వంత్ వర్మకు గట్టి ఎదురుదెబ్బ.. అలహాబాద్‌కు బదిలీ వద్దంటూ బార్ అసోసియేషన్ ధర్నా

Justiceyashwantvarma

Justiceyashwantvarma

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో వర్మను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని అలహాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అవినీతి న్యాయమూర్తి తమకు వద్దంటూ మంగళవారం పెద్ద ఎత్తున లాయర్లు ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో కూడా వర్మ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: Pooja Hegde : డబ్బు తీసుకొని మరి నన్ను ట్రోల్ చేస్తున్నారు..

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ మాట్లాడుతూ.. యశ్వంత్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయొద్దని కోరారు. వర్మ ఇచ్చిన తీర్పులను రివ్వూ చేయాలని డిమాండ్ చేశారు. భోజన సమయంలో తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు. వర్మ బదిలీని నిరసిస్తూ న్యాయవాదులంతా న్యాయపరమైన వృత్తికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. బదిలీ ఆపేంత వరకు పోరాటం చేస్తామని.. తమకు ప్రజల మద్దతు ఉందని తెలిపారు. వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ తమకు 22 సంస్థలు లేఖలు ఇచ్చినట్లుగా గుర్తుచేశారు. అయినా వర్మను సుప్రీంకోర్టు కొలీజయం ఎందుకు కాపాడుతుందో అర్థం కావడం లేదన్నారు. బదిలీని నిలిపేసిన తర్వాతే తమ ఆందోళనలను విరమిస్తామని ప్రకటించారు. న్యాయవ్యవస్థను కాపాడటానికి అవసరమైతే ప్రాణ త్యాగమైన చేస్తామని.. అలా చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కోరారు.

ఇది కూడా చదవండి: MMTS Incident: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం.. మహిళా ప్రయాణికురాలి రియాక్షన్ ఇదే..

ఇటీవల ఢిల్లీలో యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతుండగా పెద్ద ఎత్తున డబ్బులు కట్టలు దొరికాయి. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. అనంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా దృష్టికి వెళ్లడంతో వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.