ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో వర్మను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని అలహాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన కేసులో కొందరు న్యాయవాదులు జిల్లా జడ్జిని ఆశ్రయించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులు కోర్టు ఆవరణలోనే పోలీసులను పిలిచారు.
Budwel Lands: బుద్వేల్ భూముల వేలంపై బార్ అసోసియేషన్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం తిరస్కరించింది. బుద్వేల్ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని టీఏఏ పీఐఎల్ దాఖలు చేసింది.
ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేది. కాని ఆదిలాబాద్ ను కూడా ఐటీ మ్యాప్ లో పెట్టిన సిఎం కేసీఆర్ విజన్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.