NTV Telugu Site icon

Himachal: హిమాచల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రెస్టారెంట్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశం

Himachal

Himachal

కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్‌ నిర్వహించే యజమానులు, నిర్వాహకుల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యోగి సర్కార్ మాదిరిగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమస్య తలెత్తితే పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా చూస్తామని రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు.

ఇది కూడా చదవండి: Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..

ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే రాష్ట్రంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ విలేకరులతో అన్నారు. పరిశుభ్రమైన ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఫుడ్ స్టాల్స్‌లో ఆహార లభ్యతపై ప్రజల భయాలు పరిగణనలోకి తీసుకొని సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Manu bhaker: ప్రైవేట్ ఈవెంట్‌ల్లో మెడల్స్ ప్రదర్శన‌పై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!

ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కూడా నేమ్ బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. తినుబండారాల దుకాణ యజమానులు, నిర్వాహకులు, యజమానుల పేర్లను వారి ఆహార కేంద్రాల వెలుపల ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీటీవీల ఏర్పాటును కూడా తప్పనిసరి చేసింది.

ఇది కూడా చదవండి: Minister Atchannaidu: అర్హత లేని వారూ పథకాలు పొందుతున్నారు.. వారిని కట్టడి చేస్తాం..