UPI: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు డిజిటల్ గా మారబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది. అన్ని అభివృద్ధి, ఆదాయ సేకరణ కోసం తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను చేసేలా పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని లేఖలో తెలిపింది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల సమక్షంలో రాష్ట్రాలు పంచాయతీల్లో యూపీఐ సేవలన్ని ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాకలు లేఖ రాసింది.
దేశంలో 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యూపీఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంపంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పిఎంఎఫ్‌ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. ఇకపై పంచాయతీలకు డిజిటల్‌గా చెల్లింపులు జరగనున్నాయి. చెక్కులు మరియు నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయని ఆయన తెలిపారు.
Read Also: Sejal Suside Attempt: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఇది మూడోసారి
జూన్ 30న సర్వీస్ ప్రొవైడర్లు, వెండర్స్ తో సమావేశాలు నిర్వహించాలని పంచాయతీలను మంత్రిత్వశాఖ కోరింది. UPI ప్లాట్‌ఫారమ్‌లు జీపే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పేలకు సంబంధించివన సంబంధిత వ్యక్తుల వివరాలను మంత్రిత్వశాఖ షేర్ చేసింది. జూలై 15 నాటికి, మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎన్నుకోవాలని, జూలై 30 లోపు వెండర్లని ఖరారు చేయాలని సూచించింది.
అధికారులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని సూచించింది. డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడం వల్ల అవినీతిని అరికట్టవచ్చునని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 జనవరిలోనే BHIM ద్వారా రూ.12.98 లక్షల కోట్ల విలువైన 806.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. డిజిటల్ లావాదేవీలలో గ్రామీణ, పెరి-అర్బన్ ప్రాంతాల సహకారం దాదాపు 50 శాతంగా ఉంది. పంచాయతీ రాజ్ సంస్థలు PFMS-eGram Swaraj ఇంటర్‌ఫేస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాయి. 90 శాతం పంచాయతీ రాజ్ సంస్థలు ఆన్ లైన్ ద్వారా ఆడిట్ చేయబడినట్లు మంత్వత్వ శాఖ తెలిపింది.
