NTV Telugu Site icon

Union Cabinet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు..

Central Govt

Central Govt

Union Cabinet: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్‌ సంతాపం తెలపనుంది. అలాగే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 28) ఢిల్లీలో జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. మన్మోహన్‌ మృతి పట్ల మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇక, ఇవాళ జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

Read Also: VenkyAnil -3 : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం ‘నేను పాడతా’ అంటున్న వెంకీ

అయితే, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికన ఆర్థికవేత్త, ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ పేరు సంపాదించుకున్నారు.

Show comments