Pakistan: పాక్‌లో పట్టుబడ్డ అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ సన్నిహితుడు..
- పాకిస్తాన్లో పట్టుబడ్డ ఆల్ ఖైదా ఉగ్రవాది..
- ఒసామా బిన్ లాడెన్ సన్నిహితుడిగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్ అత్యంత సన్నిహితుడిగా పరిణగించబడుతన్న అమీన్ ఉల్ హక్‌ని పాకిస్తాన్లో శుక్రవారం అరెస్ట్ చేశారు. యూఎన్ ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాది అయిన హక్‌ని పంజాబ్ ప్రావిన్స్ ఉగ్రవాద నిరోధక అధికారులు పట్టుకున్నారు. అమెరికా ట్విన్ టవర్స్‌పై 9/11 దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అయిన బిన్‌లాడెన్‌కి ఇతను సన్నిహితుడు. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ గడ్డపై ఆల్‌ఖైదా ఉగ్రవాది పట్టుబడ్డాడు. పంజాబ్ ప్రావిన్సుల్లో విధ్వంసానికి హక్ ప్లాన్ చేస్తున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోరాటంలో ఇది గణనీయమైన పురోగతి అని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పాకిస్తాన్ అధికారి తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో ఇతని పేరు ఉంది. అయితే, దీనిపై పాకిస్తాన్ అంతర్గత(హోమ్) మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. మహ్మద్ ఉల్ హక్ బిన్ లాడెన్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించేవాడు. ఇతను ఆల్‌ఖైదాతో పాటు తాలిబాన్ గ్రూపులతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2011లో పాక్‌లోని అబొట్టాబాద్‌లో బిన్‌లాడెన్‌ని అమెరికా నేవీ సీల్స్ హతమార్చాయి.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!