Site icon NTV Telugu

Pakistan: పాక్‌లో పట్టుబడ్డ అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ సన్నిహితుడు..

Osama Bin Laden

Osama Bin Laden

Pakistan: ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్ అత్యంత సన్నిహితుడిగా పరిణగించబడుతన్న అమీన్ ఉల్ హక్‌‌ని పాకిస్తాన్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. యూఎన్ ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాది అయిన హక్‌ని పంజాబ్ ప్రావిన్స్ ఉగ్రవాద నిరోధక అధికారులు పట్టుకున్నారు. అమెరికా ట్విన్ టవర్స్‌పై 9/11 దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అయిన బిన్‌లాడెన్‌కి ఇతను సన్నిహితుడు. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ గడ్డపై ఆల్‌ఖైదా ఉగ్రవాది పట్టుబడ్డాడు. పంజాబ్ ప్రావిన్సుల్లో విధ్వంసానికి హక్ ప్లాన్ చేస్తున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.

Read Also: Kidney Sale Racket: “కిడ్నీ సేల్ రాకెట్‌”ని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు.. ఐదు రాష్ట్రాల్లో ముఠా వ్యాపారం..

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోరాటంలో ఇది గణనీయమైన పురోగతి అని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ పాకిస్తాన్ అధికారి తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో ఇతని పేరు ఉంది. అయితే, దీనిపై పాకిస్తాన్ అంతర్గత(హోమ్) మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. మహ్మద్ ఉల్ హక్ బిన్ లాడెన్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించేవాడు. ఇతను ఆల్‌ఖైదాతో పాటు తాలిబాన్ గ్రూపులతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2011లో పాక్‌లోని అబొట్టాబాద్‌లో బిన్‌లాడెన్‌ని అమెరికా నేవీ సీల్స్ హతమార్చాయి.

Exit mobile version