Akhilesh Yadav: రాహుల్‌కి అఖిలేష్ కండీషన్.. దేనికి సంకేతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ (Rahul Gandhis Yatra) చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈనెల 16న వారణాసిలో యాత్ర ప్రవేశించింది. ఈనెల 21 వరకు రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతుంది. ఈరోజు అమేథీ నియోజకవర్గంలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.
ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ.. ఇండియా కూటమిలో మిత్రపక్షం. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సమావేశాల్లో అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతున్నా.. అఖిలేష్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. దీంతో కూటమిలో ఏదో జరుగుతుందన్న లుకలుకలు వినపడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ అధ్యక్షుడు నితీష్‌కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు. అఖిలేష్‌పై కూడా అలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు.
Also Read
ప్రస్తుతం సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో సమాజ్‌వాదీ పార్టీ చర్చలు జరుగుతున్నాయని.. సీట్ల పంపకాలు పూర్తయ్యాక భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని తేల్చిచెప్పారు. సీట్ల పంచాయితీ తేలాకే రాహుల్‌ను కలుస్తానని అఖిలేష్ కుండబద్దలు కొట్టినట్టు (Condition) చెప్పారు. మరో రెండు రోజుల్లో రాహుల్ యాత్ర యూపీలో ముగుస్తోంది. ఈనెల 22 నుంచి రాష్ట్రంలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో యాత్రను కుదించి ఈనెల 21కి ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండ్రోజుల్లోనైనా అఖిలేష్ పాల్గొంటారా? లేదంటే డుమ్మా కొడతారా? అన్నది వేచి చూడాలి.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పుడు ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఎవరికీ వారే చర్చలు లేకుండా సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పటికే ఒంటరి పోరుకే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి.
ఇంకోవైపు బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది. బీజేపీకి 370 సీట్లు.. ఎన్డీఏ కూటమికైతే 400 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఇంత కాన్ఫిడెన్స్‌గా కమలనాథులు ఉంటే.. ఇండియా కూటమి మాత్రం సీట్ల పంచాయితీతోనే తర్జన భర్జన పడుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!