NTV Telugu Site icon

Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav Talks About Alternative Alliance Against BJP: ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి 2024లోగా ‘ప్రత్యామ్నాయం’ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఇందుకోసం కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్నందు వల్ల ప్రత్యామ్నాయం అవసరం ఉందని, నిరుద్యోగం కూడా పెరుగుతోందని తెలిపారు. భారతీయులందరికీ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన హక్కులు సైతం హరించబడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీలో ఈనెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Lokesh Kanagaraj: ‘రోలెక్స్’ పాత్ర కోసం సెపరేట్ సినిమానే ఉంటుంది…

కాగా.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్, అఖిలేష్ యాదవ్ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యారు. బీజేపీకి వ్యతిరేక కూటమిపై చర్చించారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభించడంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ.. ఆయా రాష్ట్రాల్లో పోలీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే తాము కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే! అఖిలేశ్ యాదవ్ కూడా కేసీఆర్‌తో కలిసి నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే.. కాంగ్రెస్‌కి కూడా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయమని కేసీఆర్ చెప్తుండగా, అఖిలేశ్ మాత్రం కాంగ్రెస్‌ని వ్యతిరేకించడం లేదు. ఆయన భార్య డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాదాలకు నమస్కారం చేయడం గమనార్హం.

Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్

ఇదిలావుండగా.. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేపట్టారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీ వెళ్లారు. వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు తరలివచ్చే అవకాశం ఉంది.

Show comments