Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్‌తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
- అఖిలేష్ యాదవ్‌తో CJP నేత ఆశుతోష్ రాంకా 90 నిమిషాల పాటు భేటీ.
- రాజస్థాన్, మహారాష్ట్రల తర్వాత యూపీని సీజేపీ టార్గెట్ చేస్తోందా.?
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సమావేశంపై ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా ఏదో పెద్దగా జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కాక్రోక్ జనతా పార్టీ(సీజేపీ) జాతీయ సహ కన్వీనర్ ఆశుతోష్ రాంకా గురువారం లక్నోలో రహస్యంగా కలిశారు. దాదాపుగా ఇద్దరు 90 నిమిషాల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది. తాము ప్రెజర్ గ్రూపుగా ఉంటామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీజేపీ ఇప్పుడు అఖిలేష్‌తో భేటీ కావడం, అది కూడా యూపీ ఎన్నికల ముందు భేటీ కావడం కీలకంగా మారింది.
గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్పీ ప్రధాన కార్యాలయం సమీపంలోని జనేశ్వర్ మిశ్రా ట్రస్ట్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీపై అటు ఎస్పీ, ఇటు సీజేపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సీజేపీ ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేయాలని ‘‘ఫిక్స్ ది స్కూల్’’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించవద్దని యూపీ, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- India-Belgium: పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్‌కు బెల్జియం హామీ
- XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
- Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
రాజస్థాన్ తర్వాత సీజేపీ యూపీని టార్గెట్ చేసిందా?
నిజానికి సీజేపీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే స్కూళ్లలోని సమస్యల్ని ఎత్తిచూపుతోందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు రాజస్థాన్, మహారాష్ట్ర తర్వాత యూపీని సీజేపీ టార్గెట్ చేసిందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పేపర్ లీక్, విద్యా వ్యవస్థ సమస్యల్ని లేవనెత్తాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్‌లో ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన అశుతోష్ రాంకా బృందంపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడింది బీజేపీ గుండాలే అని సీజేపీ ఆరోపించించింది. గ్రామస్తులు మాత్రం తమకు ఏ పార్టీలో సంబంధం లేదని చెప్పింది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పాఠశాలల్లో పర్యటించేందుకు సీజేపీ సిద్ధమవుతుందా? దీనికి అఖిలేష్ యాదవ్ నుంచి మద్దతు కోరిందా? అనే అనుమానాలు వ్యక్తమివుతున్నాయి. యూపీలో వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్న ఈ సమయంలో ఆ రాష్ట్రంలో పెద్ద ఉద్యమానికి సీజేపీ సిద్ధమై, రాజకీయ రంగు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నీట్ పేపర్ లీక్ జంతర్ మంతర్ నిరసనల సమయంలో అశుతోష్ రాంకా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం యోగిని సవాల్ చేస్తూ హెచ్చరించారు. రాష్ట్రంలో పేపర్ లీక్ ఆగకపోతే జంతర్ మంతర్ కన్నా పెద్ద ఉద్యమాన్ని చేపడుతామని ప్రకటించాడు. ఇప్పుడు అఖిలేష్‌తో గంటన్నర పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించాడు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్‌తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
-
India-Belgium: పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్‌కు బెల్జియం హామీ
-
Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డు..
-
XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
-
Perni Nani: టెట్ క్వాలిఫై కానివారు మెరిట్ లిస్టులోకి ఎలా..? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఆన్లైన్లో పెట్టే దమ్ముందా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!