UP: అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆయన కూడా రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్… అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి… విజయం సాధించారు. ఇప్పటికే ఆయన ఆజంగఢ్ లోక్‌సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అఖిలేష్ యాదవ్… ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖిలేష్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఆజం ఖాన్ కూడా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాంపూర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆజంఖాన్.. శాసనసభ ఎన్నికల్లో రాంపూర్ స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన కూడా… ఒక పదవిని వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also: Owaisi: ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా.. బీజేపీ శతృవే..
Also Read
- Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
- Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
- CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
- LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
ఎస్పీ చీఫ్ అఖిలేష్.. అజంఖాన్‌లు.. పార్లమెంట్ సభ్యులుగానే కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్పీ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. రాజకీయ పరిస్థితులు, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దిగువసభలో పార్టీని బలహీనపర్చొద్దని అఖిలేష్ భావిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో వీరు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ బాధ్యతలను శివపాల్ యాదవ్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేతగా శివపాల్‌ను ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
- Tags
తాజావార్తలు
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!