Site icon NTV Telugu

Akbaruddin Owaisi: ఔరంగాబాద్ పేరును మార్చినవారు మేయర్‌ కావాలనుకుంటున్నారా.?

Owaisi

Owaisi

Akbaruddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి ముస్లింలపై దాడులు పెరిగాయని అన్నారు. లవ్ జిహాద్ పేరుతో ప్రజల్ని చంపడాన్ని మరిచిపోయారా.? అని అడిగారు. ‘‘మూక దాడులను జరుగుతున్నాయని, బుర్ఖా కారణంగా బాలికలు విద్యకు దూరమయ్యారని, ముస్లింలు అయినందుకు చంపబడుతున్నారని, గడ్డం ఉన్నందుకు ఒక వ్యక్తిని రైలులో కాల్చి చంపారని, హిజాబ్ తీసేస్తున్నారని’’ ఇవన్నీ మీరు మరిచిపోయారా? అని ఓవైసీ ప్రశ్నించారు.

Read Also: NIA: మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు..

ముస్లింలు ఐక్యంగా ఉండాలని కోరారుు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ముస్లిం మహిళ హిజాబ్ తొలగించేందుకు ప్రయత్నించడాన్ని విమర్శించారు. ఇళ్లను కూల్చేవేయడం గురించి మాట్లాడుతూ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని , అయినా మనమంతా మౌనంగా ఉంటున్నామని అన్నారు. శత్రువు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని, మనం అర్థం చేసుకోకపోతే, వారు మనల్ని నాశనం చేస్తారని అన్నారు. ప్రభుత్వం పథకాల్లో ముస్లింల వాటా చాలా తక్కువగా ఉందన్ని చెప్పారు. ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని అన్నారు.

‘‘ఎంఐఎం లోక్‌సభ సీటును కోల్పోయిందని, ఇప్పుడు మీరు ఔరంగాబాద్ మేయర్ పదవిని కూడా కోల్పోవాలనుకుంటున్నారా? మీ సోదరుడు మేయర్ కావడం చూడకూడదని అనుకుంటున్నారా.? లేకపోతే ఔరంగాబాద్ పేరున మార్చిన వ్యక్తులు మేయర్ అవుతారు’’ అని బీజేపీ, శివసేనను విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అక్బరుద్దీన్ ఖండించారు. షిండే మోడీ భక్తుడని, ఫడ్నవీస్ కూడా అంతేనని అన్నారు.

Exit mobile version