Akbaruddin Owaisi: ఔరంగాబాద్ పేరును మార్చినవారు మేయర్ కావాలనుకుంటున్నారా.?
- ముస్లింలు అంతా ఏకం కావాలని పిలుపు..
- బీజేపీపై అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు..
- మూక దాడులు, లవ్ జిహాద్‌పై కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akbaruddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి ముస్లింలపై దాడులు పెరిగాయని అన్నారు. లవ్ జిహాద్ పేరుతో ప్రజల్ని చంపడాన్ని మరిచిపోయారా.? అని అడిగారు. ‘‘మూక దాడులను జరుగుతున్నాయని, బుర్ఖా కారణంగా బాలికలు విద్యకు దూరమయ్యారని, ముస్లింలు అయినందుకు చంపబడుతున్నారని, గడ్డం ఉన్నందుకు ఒక వ్యక్తిని రైలులో కాల్చి చంపారని, హిజాబ్ తీసేస్తున్నారని’’ ఇవన్నీ మీరు మరిచిపోయారా? అని ఓవైసీ ప్రశ్నించారు.
Read Also: NIA: మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు..
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ముస్లింలు ఐక్యంగా ఉండాలని కోరారుు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ముస్లిం మహిళ హిజాబ్ తొలగించేందుకు ప్రయత్నించడాన్ని విమర్శించారు. ఇళ్లను కూల్చేవేయడం గురించి మాట్లాడుతూ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని , అయినా మనమంతా మౌనంగా ఉంటున్నామని అన్నారు. శత్రువు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని, మనం అర్థం చేసుకోకపోతే, వారు మనల్ని నాశనం చేస్తారని అన్నారు. ప్రభుత్వం పథకాల్లో ముస్లింల వాటా చాలా తక్కువగా ఉందన్ని చెప్పారు. ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని అన్నారు.
‘‘ఎంఐఎం లోక్‌సభ సీటును కోల్పోయిందని, ఇప్పుడు మీరు ఔరంగాబాద్ మేయర్ పదవిని కూడా కోల్పోవాలనుకుంటున్నారా? మీ సోదరుడు మేయర్ కావడం చూడకూడదని అనుకుంటున్నారా.? లేకపోతే ఔరంగాబాద్ పేరున మార్చిన వ్యక్తులు మేయర్ అవుతారు’’ అని బీజేపీ, శివసేనను విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అక్బరుద్దీన్ ఖండించారు. షిండే మోడీ భక్తుడని, ఫడ్నవీస్ కూడా అంతేనని అన్నారు.
తాజావార్తలు
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!