భారతదేశంలోకి మరో ఎయిర్ లైన్ సంస్థ అడుగుపెట్టబోతోంది. బిలియనీర్, షేర్ మార్కెట్ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ‘ ఆకాశ ఎయిర్’ త్వరలోనే ఇండియాలో తన సేవలను ప్రారంభించబోతోంది. ఆకాశ ఎయిర్ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు ఏమియేషన్ రెగ్యులేటర్ అథారిటీ, డీజీసీఏ నుంచి అనుమతి వచ్చింది. ఆకాశకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) ను డీజీసీఏ ఇచ్చింది. దీంతో ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపడానికి మార్గం సుగమం అయింది. డీజీసీఏ నిర్ణయంపై ఆకాశ ఎయిర్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది ఆకాశ ఎయిర్ లో ముఖ్యమైన మైలురాయి అని ట్వీట్ చేసింది. ఎయిర్ లైన్స్ సిబ్బంది, ఆస్తులు, ఇతర వ్యవస్థలు, ఉద్యోగులు, ప్రజల భద్రతను పరిశీలించిన తర్వాత ఏఓసీ సర్టిఫికేట్ ను డీజీసీఏ జారీ చేస్తుంది.
ఆకాశ ఎయిర్ గత నెలలో బోయింగ్ 737 మాక్స్ విమానాాన్ని అందుకుంది. ఈ నెలఖరులో మరో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ఆకాశ ఎయిర్ సర్వీసులను ప్రారంభిస్తామని.. కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆకాశ ఎయిర్ 18 విమానాలు, ఆ తరువాత ప్రతీ నెలకు 12-14 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టనుంది. మొత్తం ఐదేళ్లలో 72 విమానాలను ఆర్ఢర్ చేసింది ఆకాశ ఎయిర్
