Site icon NTV Telugu

AK Bharti: పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ పుకార్లు.. అక్కడ ఏముందో మాకు తెలీదు

Kiranahills

Kiranahills

పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో ఏముందో తమకు తెలియదని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. కిరణా హిల్స్‌ ఘటనపై మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కిరణా హిల్స్‌లో అణు కేంద్రాన్ని భారత దళాలు లక్ష్యంగా చేసుకోలేదన్నారు. వాస్తవానికి అక్కడేముందో తమకు కూడా తెలియదని పేర్కొన్నారు. కిరణా హిల్స్‌లో అణు కేంద్రం ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు ఆ విషయం తెలియదని.. భారత్ దళాలు కూడా కిరణా హిల్స్‌ను తాకలేదని వెల్లడించారు. ఏదేమైతే పాకిస్థాన్‌కు భారీ నష్టం జరిగిందని.. తమ దాడుల్లో కిరణా హిల్స్‌కు నష్టం జరిగి ఉండొచ్చేమోనని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Balochistan: భారత్ సహకరిస్తే పాకిస్తాన్‌ని నిర్మూలిస్తాం.. బీఎల్ఏ సంచలనం..

ఇక భవిష్యత్‌లో ఎలాంటి దాడులు జరిగినా భారత్ వైమానిక దళం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నట్లు తెలిపారు. టర్కీ డ్రోన్లను సునాయాసంగా కూల్చేసినట్లు పేర్కొన్నారు. ఏ దేశ క్షిపణులు, డ్రోన్లు భారత్‌ను ఏమీ చేయలేకపోయాయన్నారు. పాక్‌లోని రక్షణ వ్యవస్థలన్నీ వినాశనమయ్యాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్‌‌”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?

Exit mobile version