Ajit Pawar: మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాని ఉద్దేశిస్తూ ‘‘ ద్రౌపది’’ వ్యాఖ్యలు చేశారు. బారామతి నుంచి పోటీ చేస్తున్న తన భార్య సునేత్ర తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇదే స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
Read Also: Mahua Moitra: ఆమె ఎనర్జీకి కారణం సె*క్స్.. ఎంపీ అభ్యర్థి కామెంట్స్ వైరల్
బుధవారం ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో లింగ నిష్పత్తిలో తేడా ఉందని, వెయ్యి మంది అబ్బాయిలకు దాదాపుగా 850 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని, ఇలాగే కొన్ని చోట్ల 790 మంది ఆడపిల్లలు ఉన్నారని, ఇది చాలా సమస్యలకు దారి తీస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ‘ద్రౌపది’(ద్రౌపది ఐదుగురితో వివాహం) ఆలోచించే పరిస్థితి వస్తుందని అన్నారు. మహాభారతం ప్రకారం.. ద్రౌపది పంచ పాండవులను పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలపై శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగ నిష్పత్తి గురించి మాట్లాడేటప్పుడు వేరే ఉదాహరణలు కూడా చెప్పొచ్చని ఆయన అన్నారు. ఇలాంటి ప్రకటనల వల్లే శరద్ పవార్ గతంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. పెళ్లిళ్లు జరగడం లేదని, దానికి కారణాలు ఏంటనే ఉదాహరణలో చెప్పొచ్చు, కానీ ద్రౌపది వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.