NTV Telugu Site icon

Modi Cabinet: అజిత్ పవార్‌కి మోడీ షాక్.. కేబినెట్‌లో దక్కని చోటు..

New Project (8)

New Project (8)

Modi Cabinet: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్‌లో చోటు దక్కింది.

ఇదిలా ఉంటే అజిత్ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి మాత్రం భారీ షాక్ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు. అయితే, ప్రఫుల్ పటేల్‌కి మోడీ కేబినెట్‌లో చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ, ఆయనకు సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపింది.

Read Also: Modi 3.0 Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణేలకు కేబినెట్‌లో దక్కని చోటు..?

ఇదిలా ఉంటే ఈ పరిణామంపై ప్రఫుల్ పటేల్ తన అనాసక్తిని బహిరంగంగా తెలిపారు. గతంలో తాను కేంద్రమంత్రిగా పనిచేశానని, సహాయమంత్రి పదవి దక్కడం తన పదవిని తగ్గించడమే అని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీకి చెప్పామని , కొన్ని రోజులు ఆగాలని కోరినట్లు చెప్పారు. దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమకు ఒక లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారని, రాబోయే 2-3 నెలల్లో రాజ్యసభలో 3 మంది సభ్యులు వస్తారని మొత్తం ఎంపీల సంఖ్య 4 అవుతుందని, తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తామని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

ఎన్డీయే పెట్టుకున్న రూల్ ప్రకారం.. ఎవరైనా పార్టీ అధ్యక్షుడిగా ఉండీ, ఎంపీగా గెలుపొందిన వారికి కేబినెట్ పదవి ఇవ్వడం లేదా 10 మంది ఎంపీలు ఉన్నవారికి ఒక కేబినెట్ మంత్రితో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇవ్వాలని ఒక ఫార్మూలా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ విషయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజిత్ పవార్ మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పార్టీ నుంచి కేవలం ప్రఫుల్ పటేల్ మాత్రమే గెలవడంతో సహాయమంత్రిని ఆఫర్ చేసినట్లు తెలిసింది.