Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, మహారాష్ట్ర బారామతి ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రన్ వే నుంచి పక్కకు వెళ్లి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. కాగా, ఫ్లైట్ స్కిడ్ కావడంతో పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు పేర్కొంటున్నారు. కాగా ప్రమాదానికి గురైన Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ ను ముంబైకి చెందిన VSR సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించారు. అయితే, సాంకేతిక లోపంతోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం కూలింది అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విమానం కూలిపోయి 2 ముక్కలైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా సెక్యూరిటీ గార్డ్, పీఏ, ఇద్దరు పైలెట్స్ మరణించారు.
Read Also: OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
మరోవైపు, అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాన మంత్రి మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ప్రజా నాయకుడు, ఆయనకు క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలు ఉండేవి.. మహారాష్ట్ర ప్రజలకు సేవా చేయడంలో ముందుండి, కష్టపడి పని చేసే వ్యక్తి.. పరిపాలనా విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో పాటు పేదలను, అణగారిన వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు. అజిత్ అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరం.. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.