Site icon NTV Telugu

Ajit Pawar Plane crash: సమస్యను ముందే గుర్తించిన పైలట్.. మూడోసారి ల్యాండింగ్ చేస్తుండగా..!

Ajit Pawar9

Ajit Pawar9

బారామతి విమాన ప్రమాదం మహారాష్ట్రలో తీవ్ర విషాదాన్ని నింపింది. విమానం కూలి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్..
అజిత్ పవార్.. బారామతి నియోజకవర్గంలో బుధవారం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గ్రహించాడు. దీంతో బారామతి విమానాశ్రయంలో ఉదయం 8:42 నిమిషాలకు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండోసారి కూడా ప్రయత్నించారు. మూడోసారి 8:45 గంటలకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా విమానం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటల్లో కాలిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.

ఇక ప్రమాదంపై దర్యాప్తు సంస్థ ఏఏఐబీ రంగంలోకి దిగింది. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషించనుంది. అయితే ల్యాండింగ్ సమయంలో లైటింగ్ సరిగ్గా లేకపోవడంతోనే మొదటి సారి విఫలయత్నం అయిందని.. రెండోసారి కూడా అలాగే జరిగిందని.. మూడోసారి ఉదయం 8:45 గంటలకు రాడర్ నుంచి సిగ్నల్ కట్ అయిపోయింది. దీంతో వెంటనే భూమిని ఢీకొట్టి కూలిపోయినట్లుగా భావిస్తున్నారు.

 

Exit mobile version