Ajit Pawar Plane Crash: ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు.. పైలట్ ఏం చేశాడంటే..!
- అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు
- వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
- ప్రాథమిక దర్యాప్తులో సంచలన అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రమాదం జరగగానే ఢిల్లీ నుంచి హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని (ఏఏఐబీ) కీలక ఆధారాలను సేకరించింది.
అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా వర్గాలు పేర్కొంటున్నాయి. పైలట్ తప్పిదం కారణంగానే ఈ ఘోరం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
పైలట్ రన్‌వేను తప్పుగా అంచనా వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి ల్యాండింగ్‌కు కుదరనప్పుడు.. రెండో ల్యాండింగ్‌కు సిద్ధపడుతున్న తరుణంలో పైలట్ పొరపాటు చేసినట్లుగా ప్రాథమిక పరిశోధనలో వెల్లడైనట్లుగా వర్గాలు చెబుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో విజిబిలిటీ సరిగా లేదని.. ఆ సమయంలో వెంటనే పూణెకు మళ్లించి ఉండవచ్చని నివేదించింది. కానీ పైలట్ మాత్రం ఆ పని చేయలేనట్లుగా కనిపించింది. అయినా కూడా పైలట్ విమానాన్ని తిరిగి సమలేఖనం చేయడానికి ప్రయత్నించాడని.. ఓ వైపు వేగం.. ఇంకో వైపు ల్యాండింగ్‌కు ఆలస్యమైనట్లుగా కనిపించినట్లుగా వర్గాలు చెబుతున్నాయి. అయితే వీఐపీ విమానాలు, హెలికాప్టర్ కార్యకలాపాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సమయానికి ల్యాండ్ చేయడానికి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: UK-China: అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం
బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధపడుతున్న తరుణంలో కూలిపోయింది. ఈ విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, పైలట్ సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యా్ప్తు చేస్తోంది. ఇక గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రి నారా లోకేష్, పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Ajit pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన అమిత్ షా, రాష్ట్ర మంత్రులు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..