NTV Telugu Site icon

India-China: భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం బీజింగ్కు అజిత్ దోవల్..

China

China

India-China: సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారంపై చర్చించేందుకు భారత్, చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధులు సమావేశం ఈ రోజు (డిసెంబర్ 18) బీజింగ్‌ జరగనుంది.. ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పాల్గొననున్నారు. అయితే, తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి సైన్యాలు వైదొలిగేందుకు అక్టోబర్‌ 21వ తేదీన చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే అంశంపై ఈ బృందాలు ప్రధానంగా చర్చలు జరపనున్నాయి.

Read Also: Off The Record: గ్రంధి శ్రీనివాస్‌ వైసీపీని ఎందుకు వదిలేశారు?

కాగా, 23వ దఫా చర్చలకు చైనా విదేశాంగ వ్యవహారాల సెంట్రల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ వాంగ్‌ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ల సారథ్యం వహిస్తారని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెల్లడించింది. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకు వచ్చేందుకు మార్గం క్లియర్ అవుతందని భావిస్తున్నారు. భారత్‌– చైనాల మధ్య ఉన్న 3,488 కిలో మీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు భేటీ అయింది. లాస్ట్ టైం 2019లో చర్చలు జరిపాయి.

Show comments