Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోవల్ తన సర్వీసు స్టార్టింగ్ రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన సంఘటనను తాజాగా బహిర్గతం చేశారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన, సిక్కిం సరిహద్దుల్లో జరిగిన ఒక మిషన్ విఫలమై తమ సీక్రెట్ ఏజెంట్లు చైనా సైన్యం చేతికి చిక్కిన వైనాన్ని, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు.
అసలేం జరిగిందంటే..
సిక్కిం భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం కాకముందు, 20 ఏళ్ల వయసున్న యువ ఐపీఎస్ అధికారిగా అజిత్ డోవల్ అక్కడి సీక్రెట్ సర్వీస్ టీంకి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న టైం అది.. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కదలికలపై నిఘా పెట్టడం ఆయన బాధ్యతల్లో ఒకటి. ఈ క్రమంలో సమాచార సేకరణ కోసం పంపించిన ఒక ప్రత్యేక నిఘా బృందం వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, 15 రోజులైనా వెళ్లిన వాళ్లు రాలేదు. ప్రతికూల వాతావరణం, మంచు తుఫానుల నడుమ వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక అజిత్ డోవల్ అండ్ టీంకి తీవ్ర ఆందోళన నెలకొంది.
Also Read
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
చైనా చెరలో భారత ఏజెంట్లు
ఆ తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు డోవల్ వివరించారు. మా టీం వాళ్లు సరిహద్దు దాటి చైనా సైన్యానికి దొరికిపోయినట్లు తేలింది. సుదీర్ఘ విచారణ, తీవ్ర ఒత్తిళ్ల అనంతరం దౌత్యపరమైన సంప్రదింపులతో చైనా వారిని రిలీజ్ చేసింది. అయితే వారు అప్పటికే మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన స్థితిలో తిరిగి ఇండియా వచ్చారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ స్టార్ట్ కావడంతో, తన కెరీర్ అంతటితో క్లోజ్ అయ్యిందని భావించినట్లు డోవల్ చెప్పారు. అయితే అధికారిక విచారణలో హెడ్ ఆఫీస్ నుంచి తమకు అందిన మ్యాపులు, రూట్ స్కెచ్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. తప్పుడు మ్యాపుల కారణంగానే తమ ఏజెంట్లు దారి తప్పి చైనా భూభాగంలోకి ప్రవేశించారని స్పష్టమవడంతో తనకు క్లీన్ చిట్ లభించిందన్నారు.
షెర్పా నేర్పిన జీవిత పాఠం
ఆ క్లిష్ట సమయంలో తీవ్ర నైరాశ్యంలో ఉన్న తనకు, ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఓ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ చెప్పిన మాటలు కొత్త దిశానిర్దేశం చేశాయన్నారు. “జీవితం కూడా ఒక మ్యాప్ లాంటిదే.. కొందరు సరిగ్గా చదువుతారు, కొందరు తప్పుగా చదువుతారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం? ఎక్కడికి వెళ్లాలి? అక్కడికి ఎలా చేరుకోవాలి? అనే ఈ మూడు విషయాలపై స్పష్టత ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చు” అని ఆ షెర్పా చెప్పిన పాఠాన్ని ఈ సందర్భంగా డోవల్ విద్యార్థులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Roorkee, Uttarakhand: At the IIT Roorkee Convocation, National Security Advisor Ajit Doval says, "I was very sad. It was one of those phases in life when you feel very down. So far, my career was going quite well… I had a colleague, an old Tibetan Sherpa, who was a… https://t.co/jSQTTLkfHk pic.twitter.com/Jhxq3SUa2y
— ANI (@ANI) September 19, 2026
తాజావార్తలు
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!