Site icon NTV Telugu

Ajay Maken: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర సమయంలో ఇలా..!

Ajay Maken

Ajay Maken

ఓవైపు కన్యాకుమారి నుంచి భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి.. కాశ్మీర్‌ వైపు సాగుతోన్న రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాకిచ్చా రు.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు సీనియర్‌ నేత అజయ్ మాకెన్… ఈ మేరకు పార్టీ జాతీయ అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అయితే, మరో రెండు వారాల్లో రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనున్న సమయంలో.. చోటుచేసుకున్న ఈ పరిణామం పార్టీలో కలకలం రేపుతోంది.

Read Also: Minister Merugu Nagarjuna: చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి.. లేదంటే లోకేష్‌ యాత్రను అడ్డుకుంటాం..!

అయితే, ఆది నుంచి రాజస్థాన్‌ రాజకీయాలు హీట్‌ పుట్టిస్తూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్‌ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్‌ను బరిలో దించాలని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భావించారు… గెహ్లాట్‌ సీఎం పోస్టును సచిన్ పైలట్‌కు కట్టబెట్టాలనే ప్రయత్నాలు కూడా సాగాయి.. కానీ, సచిన్‌ పైలట్‌ను సీఎంను చేస్తే తిరుగుబాటు చేస్తామంటూ గెహ్లాట్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవడం రచ్చగా మారింది.. ఆ తర్వాత సెప్టెంబర్‌ 25న జరిగిన సీఎల్పీ సమావేశానికి అశోక్‌ గెహ్లాట్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.. దీంతో, వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాకెన్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. అయినా, పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేదు.. ఇదే, ఇప్పుడు మాకెన్‌ రాజీనామాకు కారణం కావొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్ మధ్య ఉన్న సమస్యలు కాంగ్రెస్‌ అధిష్టానానికి తలనొప్పిగా ఉండగా.. ఇప్పుడు అజయ్‌ మాకెన్ రాజీనామా కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది.

మాకెన్ తన రాజీనామా లేఖలో, “గత మూడు తరాలుగా కాంగ్రెస్ సిద్ధాంతాలను కట్టిబడి ఉన్నాను.. 40 ఏళ్లకు పైగా క్రియాశీల కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాను.. నేను ఎప్పుడూ రాహుల్ గాంధీదకి అనుచరుడిగా ఉంటాను, ఆయనను నేను విశ్వసిస్తాను.. విశ్వాసం కలిగి ఉంటాను అని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించేలోపు.. డిసెంబర్ మొదటి వారంలోపు కొత్త రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని మాకెన్ పార్టీని కోరారు. డిసెంబర్ 4న ఉప ఎన్నిక కూడా జరగబోతోంది.. సెప్టెంబర్ సంక్షోభ సమయంలో, మిస్టర్ మాకెన్ ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరాడు.. మహేష్ జోషి, ధర్మేంద్ర రాథోడ్ మరియు శాంతి ధరివాల్.. గెహ్లాట్‌ను మాత్రమే ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారని తీర్మానాన్ని ఆమోదించడానికి ఎమ్మెల్యేల సమాంతర సమావేశాన్ని నిర్వహించారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు, మాకెన్‌ను కలవరపరిచే ఇతర అంశాలు, గెహ్లాట్‌కు విధేయులైన ఎమ్మెల్యేలకు అందించిన షోకాజ్ నోటీసులపై ఎలాంటి ఫాలో-అప్ చేయకపోవడం మరియు సీఎల్పీ సమావేశాలు కూడా లేకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను సమీక్షించే సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు.

Exit mobile version