NTV Telugu Site icon

Air India: ఎయిరిండియా పైలట్లకు, సిబ్బందికి కొత్త యూనిఫాం.. అదిరిపోయేలా మనీష్ మల్హోత్రా డిజైన్..

Air India

Air India

Air India: టాటా గ్రూపు సొంతం చేసుకున్న తర్వాత ఎయిరిండియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన టాటా, ఇప్పుడు తన పైలట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాంని ఈ రోజు విడుదల చేసింది. 1932లో స్థాపించిబడిన ఈ ఎయిర్‌లైన్ తన యూనిఫామ్‌ని మార్చడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరినాటికి విడుదల కానున్న కొత్త యూనిఫామ్ ‘‘ఎయిరిండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం’’ అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం ఎయిరిండియాలో 10,000 మందికి పైగా విమాన సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, భద్రతా సిబ్బంది ఉన్నారు. వీరికి రెడ్, వంకాయ, గోల్డ్ రంగుల్లో కొత్త యూనిఫామ్‌ని రూపొందించారు. ఈ యూనిఫామ్‌ని ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. కొత్త యూనిఫాం శక్తివంతమైన కొత్త భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తుందని ఎయిరిండియా పేర్కొంది.

Read Also: Diya Kumari: “ప్రజల యువరాణి”.. రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..

ఎయిరిండియా కొత్త యూనిఫామ్‌ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించాలని భావిస్తోంది. ఎయిరిండియాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ లైనర్‌గా నిలిపేందుకు ఇప్పటికే కొత్తగా ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి 470 విమానాలను ఆర్డర్ చేసింది.

ఎయిరిండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ.. ఎయిరిండియా కొత్త యూనిఫాం ప్రపంచం విమానయాన చరిత్రలో అత్యున్నతంగా ఉంటుందని, మనీష్ మల్హోత్రా వినూత్ర దృష్టి ఎయిరిండియా భవిష్యత్తు కోసం ఒక ఉత్తేజకరమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అన్నారు. ఎయిరిండియా కోసం యూనిఫాం డిజైన్ చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనీష్ మల్హోత్రా అన్నారు.

Show comments