Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India to Cut Flights: దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెరుగుతున్న జెట్ ఇంధన (ATF) ధరల ప్రభావంతో ఎయిర్ ఇండియా తన విమాన కార్యకలాపాలను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను కోత పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జెట్ ఇంధన ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం విమానయాన సంస్థలపై తీవ్రంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో అనేక అంతర్జాతీయ రూట్లు నష్టాల్లోకి జారడంతో, సేవలను తగ్గించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం, ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఈ విషయంపై అంతర్గతంగా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జెట్ ఫ్యూయల్ ధరల పెరుగుదల, కరెన్సీ మార్పిడి రేట్ల మార్పులు, గగనతల పరిమితులు వంటి అంశాలు కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగి, విమానయాన రంగానికి అదనపు భారం మోపుతున్నాయి.
Also Read
దేశీయంగా కూడా ఎయిర్ ఇండియా లాభాలపై ప్రభావం పడింది. ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడం సంస్థలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో సంస్థ తన కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఈ నిర్ణయంపై ఎయిర్ ఇండియా తన సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చి, సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యతతో ముందుకు సాగాలని కోరినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో విమాన షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ashwin: “సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
ట్రెండింగ్
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!