Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు
- ఎయిరిండియా కీలక నిర్ణయం
- అంతర్జాతీయ సేవలు కుదింపు
- ప్రయాణికుల అసౌకర్యానికి ఎయిరిండియా క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సేవలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. జూన్ 12 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇక 3 నగరాలకు కార్యకలాపాలను కూడా నిలిపేసింది. ఘోర విమాన ప్రమాదం తర్వాత నిత్యం అంతరాయాలతో సతమతమవుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Netanyahu: కుమారుడి పెళ్లి గురించి నెతన్యాహు భావోద్వేగం.. సోషల్ మీడియాలో విమర్శలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
జూన్ 21 నుంచి జూలై 15 వరకు 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు తగ్గిస్తున్నామని.. అలాగే 3 విదేశీ గమ్యస్థానాలు నిలిపివేస్తున్నట్లు గురువారం ఎయిరిండియా వెల్లడించింది. ఇక వైడ్-బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Rithika Singh : అందాల ఆరబోతకు డోర్స్ ఓపెన్ చేసిన యంగ్ బ్యూటీ
ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) లలో జూలై 15 వరకు సేవలు నిలిపివేశారు. ఢిల్లీ-నైరోబి మార్గంలో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా.. అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు విమానాలు నడుస్తున్నాయని ఎయిర్‌లైన్ తెలిపింది. అంతేకాకుండా ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలలోని నగరాలను అనుసంధానించే 16 అంతర్జాతీయ మార్గాల్లో కూడా విమానాలు తగ్గిస్తున్నట్లు చెప్పింది. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ మార్గాల్లో విమాన సర్వీసులు తగ్గనున్నాయి. అలాగే యూరప్‌లోని ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమ్రిస్ట్సర్-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్‌హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్‌డామ్ మార్గాల్లో కూడా విమాన సేవలు తగ్గాయి. అదే విధంగా సవరించిన షెడ్యూల్‌లో భాగంగా ఢిల్లీ-మెల్‌బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా మరియు ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) సర్వీసులను కూడా తగ్గించారు.
సర్వీసులు తగ్గించడం కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. కేవలం మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు వాపస్ ఇచ్చేస్తామని.. లేదంటే ప్రత్యామ్నాయ విమానాల్లో వసతి కల్పించడం వంటివి చేస్తామని వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!