Site icon NTV Telugu

Air India: ఎయిర్ ఇండియాలో మరో ఘటన.. కాక్‌పిట్ లోకి మహిళను తీసుకువచ్చిన పైలెట్..

Air India

Air India

Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన ఆ సంస్థ పరువు తీసింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమానయాన సంస్థలకు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఓ పైలెట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. దీనిపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది.

Read Also: Sudan Crisis: సూడాన్ సంక్షోభం.. రంజాన్ సందర్భంగా మూడు రోజులు కాల్పుల విరమణ

ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన భద్రతా నియమాలను ఉల్లంఘించిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పైలెట్ ను విధుల నుంచి తొలగించాారా..? లేదా..? అనేదానిపై సమాచారం లేదు.

ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో చేరాల్సిందిగా పైలట్ అదే విమానంలో ప్రయాణీకురాలిగా ఉన్న తన మహిళా స్నేహితురాలిని ఆహ్వానించాడని, ఆ మహిళ ప్రయాణసమయం అంతా కాక్ పిట్ లోనే ఉండిపోయిందని అధికారి తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పైలెట్ పై వేటు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version