NTV Telugu Site icon

Air India: ముంబై-లండన్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు..

Air India

Air India

Air India: వరస బాంబు బెదిరింపుల ఘటనలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరసగా నాలుగో రోజు కూడా బాంబు బెదిరింపు వచ్చాయి. ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి కొన్ని గంటల ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 గురువారం తెలిపింది. విమానం ‘‘స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది.

Read Also: Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?

ముంబై నుంచి ఎయిర్ ఇండియా విబమానం ఈ రోజు ఉదయం 7.05 గంటలకు టేకాఫ్ అయింది. తూర్పు ఇంగ్లండ్ మీద ప్రయాణించే సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్ హీత్రూ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.05 గంటలకు దిగాల్సి ఉంది. ‘స్క్వాకింగ్ 7700’ విమాన పరిస్థితిని సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి తెలియజేస్తుంది. నాలుగు రోజుల్లో కనీసం 20 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు 5 ఎయిర్ ఇండియా, రెండు విస్తారా, రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఈ బాంబు బెదిరింపుల అంశంపై నిన్న పార్లమెంటరరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డీజీసీఏ అధికారులతో ఆ శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సమావేశమయ్యారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణీకులు భద్రతే తమ ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఈ ఘటనలపై సమగ్ర నివేదిక పంపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను హోం మంత్రిత్వ శాఖ కోరింది.