Air India Crash: ఇంజన్ “ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్” తప్పిదమే ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమా.?
- ఎయిరిండియా ప్రమాదానికి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ తప్పిదం కారణమా..
- పైలట్లు పొరపాటున పనిచేసే ఇంజన్‌కి ఇంధనాన్ని నిలిపేశారా..?
- విచారణ చేస్తున్న దర్యాప్తు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Crash: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఈ విమానం, టేకాఫ్ అయన 30 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులే కాకుండా నేలపై ఉన్న పలువురు మరణించారు. అయితే, దర్యాప్తులో ఇంజన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లపై పరిశోధకులు దృష్టి సారించిందని ప్రముఖ ఏవియేషన్ జర్నల్ ది ఎయిర్ కరెంట్లోని ఒక నివేదిక పేర్కొంది. భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు (AAIB) దాని AI-171 దర్యాప్తు యొక్క ప్రాథమిక నివేదికను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ కథనం వచ్చింది.
Read Also: Bangladesh: ఆందోళనకారుల్ని “కాల్చి వేయాలని” షేక్ హసీనా ఆదేశాలు..
Also Read
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
- Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
అయితే, భారత్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) సభ్యుడిగా ఉన్నందున 30 రోజుల్లోపే నివేదిక ఇవ్వాల్సి ఉంది. జూలై 11లోపు నివేదిక విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఫ్యూయల్ కంట్రోల్‌ని పైలట్లలో ఒకరు అనుకోకుండా ఒక ఇంజన్‌కి సరఫరా నిలిపివేశారా..? అని అనుమానిస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఒక ఇంజన్ ఫెయిల్యూర్ కావడంతో, పైలట్ అనుకోకుండా మరో ఇంజన్ ఇంధన సరఫరాని నిలిపేయవచ్చని ఊహిస్తున్నారు.
సాధారణంగా చెప్పాలంటే, ఒక ఇంజన్ పనిచేయని సమయంలో దానికి ఇంధన సరఫరాని నిలిపివేయడం చేస్తుంటారు. అయితే, ఆ సమయంలో పైలట్లు పొరపాటును నడిచే ఇంజన్‌కు ఇంధనాన్ని నిలిపేసే స్విచ్ ఆఫ్ చేశారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఎత్తు తక్కువగా ఉండటంతో విమానం మళ్లీ టేకాఫ్ తీసుకోలేకపోయినట్లు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
-
Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
-
Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
-
Crispy Drumstick Fry Recipe: మునగకాయతో క్రిస్పీ స్నాక్.. రెసిపీ సింపుల్!
-
Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!