Site icon NTV Telugu

Operation Sindoor: యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్‌ను చూసి నేర్చుకోండి: వైమానిక దళాధిపతి..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక సంఘర్షణ ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో భారతదేశం నుంచి నేర్చుకోవాలని అన్నారు.

Read Also: CM Revanth Reddy : ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్‌ కుటుంబంలో సమస్య

‘‘నేడు జరుగుతున్న ప్రధాన యుద్ధాలు, అది రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే ఎవరూ సంఘర్షణ ముగింపు గురించి ఆలోచించడం లేదు. వీలైనంత త్వరగా సంఘర్షణల్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే దాని గురించి ప్రపంచం భారత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను’’ అని ఢిల్లీలో ఒక కార్యక్రమంలో అన్నారు.

పాకిస్తాన్‌పై దాడి ఆపడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు తప్పుపట్టారు. మే 10న కాల్పులు విమరణపై ట్రంప్ ఒత్తిడి ఉందని, నరేంద్రమోడీ లొంగిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, దీనిపై కూడా ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేము చాలా త్వరగా యుద్ధాన్ని ముగించాము, మన లక్ష్యం ఉగ్రవాద వ్యతిరేకత, వారిపై దాడి చేశాము, కాబట్టి మన లక్ష్యాలను నెరవేరాయి. ఇంకా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏంటి? ఏదైనా సంఘర్షణకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, పురోగతిని ప్రభావితం చేస్తుంది.’’ అని అన్నారు.

Exit mobile version