Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: 274కు చేరిన ఎయిరిండియా మృతుల సంఖ్య

Ahmedabadplanecrash

Ahmedabadplanecrash

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మెడికోలు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య 274కు చేరినట్లు పేర్కొంది. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహం ఉంది. తొలుత 24 మంది మృతి చెందగా.. తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది చనిపోయారు. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. మొత్తంగా మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదం స్థలంలోనే అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ పైకప్పుపై దొరికింది. అధికారులు విశ్లేషించనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: బాధిత కుటుంబాల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం

గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. మెడికోలో, స్థానిక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Air India Plane Crash: 2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..

Exit mobile version