అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. విమానం కూలడంతో నేలపై ఉన్న 19 మంది మరణించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిగాక నివేదిక వస్తుందని అందరూ ఆశించారు. అందులోనే ప్రమాదానికి కారణమేంటో కూడా తేలిపోతుందని భావించారు. కానీ విచారణ నివేదికలో కొన్ని అంశాలు ముందే లీకయ్యాయి. ఈ అంశం మరిన్ని చిక్కుముడులకు తావిచ్చింది. ఎక్కడైనా విమాన ప్రమాదం జరిగాక.. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది. తుది నివేదిక బయటపడేదాకా.. విచారణ జరుగుతున్న తీరును అతి రహస్యంగా ఉంచుతారు. ఎక్కడా విచారణాంశాలు లీకవ్వకుండా జాగ్రత్తపడతారు. మానవ తప్పిదాలు, సాంకేతిక కారణాలు, అనుకోని ఘటనలు..…
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మెడికోలు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య 274కు చేరినట్లు పేర్కొంది.