NTV Telugu Site icon

PM Modi: రేపు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ కీలక సమావేశం..!

Pm Modi

Pm Modi

PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జులై 23వ తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. అంతకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో రేపు (గురువారం) భేటీ అవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానమంత్రి సమావేశానికి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా వస్తారని చెప్పారు. కాగా త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్ మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపటిన తర్వాత వచ్చిన బడ్జెట్ కాబట్టి.. ఇందులో ప్రధానంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కావాల్సిన రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారని తెలుస్తుంది.

Read Also: Assam Floods : అస్సాంలో నీట మునిగిన 27 జిల్లాలు.. వరదలకు విలవిలలాడుతున్న 19లక్షల మంది

అయితే, గత నెలలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో, సంస్కరణలను వేగవంతం చేయడానికి మోడీ సర్కార్ ముందుకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం విధానాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను సమర్థవంతంగా రూపొందిస్తున్నారు. ఇక, నిర్మల సీతారామన్ ఇప్పటికే రాబోయే బడ్జెట్‌పై ఆర్థికవేత్తలు, భారతీయ పరిశ్రమలకు చెందిన నిపుణులతో వరుస చర్చలు జరిపారు. ఇందులో పలువురు నిపుణులు.. వినియోగాన్ని పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం కావాలంటే ముందు సామాన్యులకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.