Site icon NTV Telugu

Maharashtra polls: బుధవారం ఖర్గే, సోనియా, రాహుల్‌తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ

Uddhavthackerayrahul Gandhi

Uddhavthackerayrahul Gandhi

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తు్న్నారు. ఇదిలా ఉంటే శివసేన యూబీటీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో పొత్తు అంశంపై చర్చించనున్నారు. ఏఏ పార్టీలకు ఎన్ని సీట్లు అనే అంశంపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా.. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. బుధవారం సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్‌ సహా మరికొన్ని పార్టీలు సమావేశం అవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత సమావేశం కాబట్టి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Divya Seth Shah : ప్రముఖ టీవీ నటి చిన్న కూతురు హఠాన్మరణం

ఈసారి మహారాష్ట్రలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పొత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. అదే ఆశతో అసెంబ్లీలో గెలవాలని ప్రయత్నిస్తుంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: చైనాతోనే పోటీ పడుదాం.. అమెరికాలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్..

Exit mobile version