NTV Telugu Site icon

Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్..

Agni Prime Missile

Agni Prime Missile

Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్‌ను తొలిసారిగా పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించింది. గురువారం డీఆర్డీఓ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మిస్సైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

Read Also: Hombale: కాంతర హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ‘రాజ్ కుమార్’ వారసుడు

ఇప్పటి వరకు వరసగా మూడుసార్లు విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించిన తర్వాత.. నిన్న రాత్రి మొదటిసారిగా ఫ్రి ఇండక్షన్ టెస్ట్ నిర్వహించారు. ‘‘ అగ్ని ప్రైమ్ మిస్సైల్ యొక్క ప్రీ ఇండక్షన్ నైట్ లాంచ్ పరీక్ష విజయవంతంగా నిర్వహించాం’’అని డీఆర్డీఓ ట్వీట్ చేసింది. రాడార్, టెలిమెట్రీ మరియు ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి రేంజ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లు మిస్సైల్ గతిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేశాయి. డీఆర్డీఓ, స్ట్రాటజిక్ కమాండ్ కు చెందిన అధికారులు ఈ పరీక్షను చూశారు. ఈ పరీక్ష విజయవంతంతో అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. న్యూ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ విజయంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీడీఓకు, సాయుధ బలగాలకు అభినందనలు తెలియజేశారు.