Site icon NTV Telugu

CJI Gavai: గవాయ్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం.. న్యాయవాదిపై చర్యలకు ఏజీ ఆమోదం

Cji Gavai

Cji Gavai

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్‌పై షూతో దాడికి యత్నం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71)పై నేరపూరిత ధిక్కార చర్యలకు ఏజీ ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయం ముగిసిన అధ్యయం అని బీఆర్.గవాయ్ అన్నారు కదా? దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం అవసరమా? అని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సమ్మతి తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇలా!

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు ధిక్కార చర్యలను అత్యవసరంగా జాబితా చేయాలని కోరారు. ‘‘నేను అటార్నీ జనరల్ అనుమతి తీసుకున్నాను మరియు రేపు జాబితా కోసం దరఖాస్తు చేసుకున్నాను’’ అని వికాస్ సింగ్ బెంచ్‌కు తెలియజేశారు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. చర్యలు తీసుకోవాల్సిందేనని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్‌గాంధీ ఎద్దేవా

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అక్టోబర్ 6న అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు.

ఇది కూడా చదవండి: Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్

గవాయ్‌పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు. ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు. ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. రాకేష్ కిషోర్‌ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గవాయ్ వెటకారంగా మాట్లాడడం వల్లే తాను దాడి చేశానని రాకేష్ కిషోర్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!

Exit mobile version