NTV Telugu Site icon

PM Modi: చిన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో విలీనం అవుతాయి..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత చిన్నచిన్న ప్రతిపక్షాలు అన్నీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతాయని అన్నారు. కాంగ్రెస్ దారిలో వెళ్లడం ప్రమాదకమని ఆయన ఈ రోజు ఓటర్లను హెచ్చరించారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) పార్టీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దారిలో పయనించడం ప్రారంభించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన అంతం అవుతుందని, ఇదే విషయాన్ని బాలా సాహెబ్ ఠాక్రే కూడా విశ్వసించారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ముందు మోకరిల్లిన శివసేన డూప్లికేట్‌ని శిక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: CAA: సీఏఏ చట్టం ప్రకారం తొలిసారిగా 14 మందికి భారతీయ పౌరసత్వం..

ఎన్నికల తర్వాత చిన్న పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం అవుతాయని మోడీ అన్నారు. అణగారిన వర్గాలకు తాను చౌకీదార్ అని చెప్పారు. మతప్రాతిపదికన బడ్జెట్‌ని విభజించడం ప్రమాదకరమని, కానీ కాంగ్రెస్ మాత్రం మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటులో శివసేన రెండుగా విడిపోయింది. మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపు ఉండటంతో ఆయనదే నిజమైన శివసేన అని ఎన్నికల సంఘం తేల్చింది. ఇదిలా ఉంటే ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు కారణంగా శరద్ పవార్ పార్టీ కూడా చీలిపోయింది. శివసేన లాగే మెజారిటీ నాయకులు అజిత్ పవార్‌ వైపు నిలబడ్డారు. ఈ రెండు పక్షాలు కూడా బీజేపీతో ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీలో జతకట్టి ఇండియా కూటమిలో ఉన్నారు.