Bangladesh: బంగ్లాదేశ్‌లో రోజురోజుకి భారత వ్యతిరేకత పెరుగుతోంది. హింసాత్మక ఉద్యమం తర్వాత ఆగస్టు 05న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యాడు. యూనస్ వచ్చినప్పటి నుంచి క్రమేపీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేక సెంటిమెంట్ బలపడుతోంది. ముఖ్యంగా మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి పార్టీలు భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి. ఇక మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
Read Also: Deputy CM Pawan Kalyan: గంజాయిపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే భారత సరిహద్దుల్లో టర్కిష్ బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. తల్పర్ అని పిలుబడే 26 తేలికపాటి యుద్ధ ట్యాంకుల్ని కొనుగోలు చేయాలని టర్కీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ట్యాంకుల్ని టర్కీ, ఇటలీ రక్షణ సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. అయితే, ఈ కొనుగోళ్లు బంగ్లాదేశ్ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందా..? లేక భారత్‌ని టార్గెట్ చేసే ఉద్దేశమా..? అనేది చర్చ నడుస్తోంది.
తల్పర్ లైట్ ట్యాంక్స్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగలవు. బంగ్లాదేశ్ భౌగోళస్థితికి, వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. విస్తారమైన చిత్తడి నేలల్లో ఇవి పనిచేయగలవు. తల్పర్ ట్యాంక్ 810-హార్స్‌పవర్ డీజిల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 600 కి.మీ వరకు దూరాలను కవర్ చేస్తుంది. గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.