Site icon NTV Telugu

Viral Video: కత్తితో పాఠశాలకు వెళ్లి టీచర్‌ను చంపేస్తానంటూ వ్యక్తి హల్‌చల్‌..

Man With Sword

Man With Sword

లుంగీ కట్టుకుని, కనీసం ఒంటిపై చొక్కా లేకుండా తన పిల్లలు చదువుకునే పాఠశాలకు వెళ్లి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఉపాధ్యాయుడిని బెదిరించి రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిహార్‌లోని అరారియాలో ఈ ఘటన జరిగింది. జోకిహాట్ పీఎస్ పరిధిలోని భగవాన్‌పూర్ పంచాయతీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి తన పిల్లలు చదివే పాఠశాల సమీపంలోనే నివసిస్తుంటాడు. ఇటీవల తన పిల్లల చదువుతున్న పాఠశాలకు ఒంటిపై చొక్కా లేకుండా కత్తి పట్టుకుని వెళ్లాడు. తన పిల్లలకు రావాల్సిన స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అందలేదని.. వాటికి బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వకుంటే మళ్లీ వస్తానని ఉపాధ్యాయులను బెదిరించాడు. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Torch Light Delivery:టార్చిలైట్ వెలుగులో డెలివరీ.. ఎక్కడంటే?

ఈ ఘ‌ట‌న‌పై పాఠ‌శాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి వివ‌రాలు తెలిపారు. అతడు పదే పదే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటాడని పోలీసులుకు వెల్లడించారు. పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కత్తి పట్టుకున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు చదువుకునే చోటుకు బట్టలు వేసుకోకుండా.. కత్తితో రావడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

Exit mobile version