NTV Telugu Site icon

Bengaluru: ప్రయాణికులకు మెట్రో షాక్.. భారీగా ఛార్జీలు పెంపు!

Bengaluru

Bengaluru

ప్రయాణికులకు బెంగళూరు మెట్రో షాకిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మెట్రో రైలు ఛార్జీలను పెంచింది. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదనకు శుక్రవారం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆమోదం తెలిపింది. అయితే పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే పెంచిన ఛార్జీల వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఛార్జీలను సవరించాలన్న ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సి) సిఫారసుకు మాత్రం బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో సవరించిన ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటిస్తామని బీఎమ్‌ఆర్‌సిఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అయితే ప్రస్తుతం కనీస ధర రూ. 10 ఉండగా.. గరిష్ట ధర రూ. 60గా ఉంది. స్మార్ట్ కార్డ్ వినియోగదారులు 5 శాతం తగ్గింపు ఉంది. 2020 నుంచి 15 శాతం తగ్గించబడింది. పెరగబోయే ధరలు.. కనీస ఛార్జీని రూ.15గా నిర్ణయించాలని చర్చ జరిగినట్లుగా సమాచారం. గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.80కి పెరగనుంది. అయితే పెరగబోయే ఛార్జీలు బీఎమ్‌ఆర్‌సిఎల్ ఇంకా వెల్లడించలేదు.

అయితే మెట్రో ఛార్జీల పెంపుపూ బెంగుళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుపై. పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఛార్జీల పెంపుతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తారన్నారు. దీంతో మెట్రో ప్రయాణాలు తగ్గిపోతాయన్నారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో రోజుకి 9 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.