Tiger: 110 ఏళ్ల తరువాత ఆ రాష్ట్రంలో కనిపించిన పులి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger spotted in Haryana after 110 years: దాదాపుగా 110 ఏళ్ల తర్వాత హర్యానాలో పులి కనిపించింది. చివరి సారిగా 1913లో పులి కనిపించినట్లు రాష్ట్ర అటవీ, వన్యప్రాణి మంత్రి కన్వర్ పాల్ చెప్పారు. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కలేసర్ నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులికి సంబంధించిన ఫోటోలు చిక్కాయని అధికారులు వెల్లడించారు. 110 సంవత్సరాల తర్వాత కలేసర్ ప్రాంతంలో పులి కనిపించడం రాష్ట్రానికి గర్వకారణం మంత్రి అన్నారు. అడవులు మరియు వన్యప్రాణులు మన సహజ వారసత్వం మరియు వాటిని రక్షించడానికి మనం ఐక్యంగా కృషి చేయాలని చెప్పారు.
Read Also: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి పాడు పని.. పోలీసులకు నోటీసులు
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ఏప్రిల్18, 19 తేదీల్లో పులి కనిపించింది. పులి వయస్సు, ఆడా..? మగా..? అని నిర్థారించేందుకు ప్లగ్ మార్క్ లను పరిశీలించేందుకు ఓ టీం ను ఏర్పాటు చేసినట్లు పంచకుల చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంఎల్ రాజ్ వంశీ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ నుండి పులి కాలేసర్కు చేరుకుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. హర్యానాలోని కలేసర్ పార్క్, హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని సింబల్బరా నేషనల్ పార్క్‌ను అనుకుని ఉంది. ఈ రెండు నేషనల్ పార్కులు దట్టమైన అటవీ ప్రాంతంతో రాజాజీ నేషనల్ పార్క్‌కి కలపబడి ఉన్నాయి. పులులు తిరిగేందుకు ఈ కారిడార్ అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం హర్యానా కలేసర్ అటవీ ప్రాంతాన్ని చేరుకున్న పులి ఈ అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటుదని భావిస్తున్నారు అధికారులు. శివాలిక్ పర్వత ప్రాంతాల్లో 11,570 ఎకరాల్లో కలేసర్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ నేషనల్ పార్క్ చిరుతలు, ఏనుగులు, అడవి పందులు, సాంబార్లకు అనేక జాతుల పక్షులకు నిలయంగా ఉంది. ఫిబ్రవరి నెలలో రాజాజీ నేషనల్ పార్క్ నుండి రెండు ఏనుగులు కాలేసర్కు వచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?