Site icon NTV Telugu

Drug Bust: సముద్రంలో ఆపరేషన్.. రూ.1200 కోట్ల హెరాయిన్ పట్టివేత

Drug Bust

Drug Bust

₹ 1,200-Crore Afghan Heroin Caught: ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఇండియాకు తీసుకువస్తున్న హెరాయిన్ ను పట్టివేశారు అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 200 కిలోల హెరాయిన్ ను మొదటగా పాకిస్తాన్ తరలించి అక్కడ నుంచి ఇరాన్ పడవలో ఇండియా, శ్రీలంకకు తరలించేందుకు ప్రయత్నించారు. గురువారం ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్ సి బి) కలిసి సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి భారీ డ్రగ్స్ దందాను పట్టుకున్నారు. ఇరాన్ పడవలో ఏడు పొరల ప్రాకేజింగ్ తో హెరాయిన్ వాటర్ ఫ్రూఫ్ గా తయారు చేసి భారత జలాల్లో శ్రీలంక పడవలోకి మార్చేందుకు ప్రయత్నించారు.

Read Also: WWE – Sara Lee: మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం.. కారణం చెప్పని తల్లి

పడవతో పాటు ఆరుగురు ఇరాన్ వ్యక్తులను, హెరాయిన్ ను కేరళలోని కొచ్చికి తీసుకువచ్చి విచారిస్తున్నట్లు ఎస్ సీ బీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ హెరాయిన్ ప్యాకింగులకు ప్రత్యేకమైన మార్కింగ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లకు స్కార్పియన్, మరికొన్నింటికి డ్రాగన్ సీల్ ఉన్నట్లు తెలిపారు. ముందుగా హెరాయిన్ పాకిస్తాన్ పంపించి అక్కడ నుంచి సముద్రంలో ఇరాన్ నౌకలోకి మార్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే సముద్రంలోనే డ్రగ్స్ శ్రీలంక నౌకలో తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీలంక నౌకను గుర్తించి అడ్డగించేందుకు ప్రయత్నించినా.. సాధ్యపడలేదని అధికారులు తెలిపారు.

అధికారులను గుర్తించి డ్రగ్స్ ముఠా సముద్రంలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. హెరాయిన్ నీటిలో పడేసేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రం మీదుగా.. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా పెరిగిందని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్, పాకిస్తాన్ పోర్టుల ద్వారా భారత దేశంలోని పశ్చిమ తీరంలోని పలు పోర్టులకు డ్రగ్స్ అక్రమంగా రవాణా అవుతోంది. తాలిబాన్లు కనుసన్నల్లో హెరాయిన్ పండిస్తున్నారు. హెరాయిన్ ను ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు తాలిబాన్లు.

Exit mobile version