NTV Telugu Site icon

Russia-Ukraine War: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదలిపెట్టండి

Russia Ukraine War

Russia Ukraine War

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. వరసగా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన నగరాలను ధ్వంసం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్ గ్రిడ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి తీసుకున్న ‘‘ కామికేజ్’’ డ్రోన్లతో విద్యుత్ గ్రిడ్స్, మౌళిక సదుపాయాలపై దాడులు చేస్తోంది. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ ను కూల్చేసిన తర్వాత ఉక్రెయిన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది రష్యా. రానున్న శీతాకాలం దృష్ట్యా రష్యా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది.

ఇరు దేశాల మధ్య ఉద్రక్తతలు తారాస్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు ఎవ్వరూ కూడా ఉక్రెయిన్ వెళ్లవద్దని కోరింది. విద్య, ఇతర కారణాలతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే దేశాన్ని వీడాలని సూచించింది. కీవ్ లోని భారతీయ రాయబార కార్యాలయం ఈ సూచనలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వెంటనే దేశాన్ని వదిలిపెట్టాలని సూచించింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకు భారతదేశం ‘‘ఆపరేషన్ గంగా’’ చేపట్టి ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థులను ఎయిర్ లిఫ్ట్ చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రొమేనియా, పోలాండ్, స్లొవేకియా, హంగేరీ, మాల్టోవా దేశాల మీదుగా ఇండియాకు తీసుకువచ్చారు.

Read Also: Anasuya sister: యాంకర్‌ గా అనసూయ చెల్లి.. మరి అక్క పరిస్థితి!

ప్రస్తుతం ఉక్రెయిన్ పై దాడుల తీవ్రతను పెంచింది రష్యా. డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలన్ స్కీ తెలిపారు. రానున్న రోజుల్ దేశంలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని ప్రజలు సిద్ధంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఇరాన్, రష్యాకు కామికేజ్ డ్రోన్లను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహంగా ఉంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కుబేలా, ఇరాన్ తో దౌత్యబంధాలను తెంచుకోవాలని మంగళవారం ప్రతిపాదించారు. ఉక్రెయిన్లను చంపేందుకు రష్యాకు ఇరాన్ సహకరిస్తుందని… ఆ దేశంపై అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ కోరుతోంది.