Site icon NTV Telugu

Aditya-L1: ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్.. ప్రధాని నరేంద్ర మోడీ హర్షం..

Aditya L1

Aditya L1

Aditya-L1: సూర్యుడిపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైంది. 125 రోజలు పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఆదిత్య-L1 ప్రోబ్ విజయవంతంగా తనకు నిర్దేశించిన లాగ్రేజియన్ పాయింట్ 1(L1)లోకి ప్రవేశించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్1 హాలో కక్ష్యలోకి శాటిలైట్ విజయవంతంగా ప్రవేశించింది.

Read Also: Jeffrey Epstein Files: యూఎస్‌లో జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రకంపనలు.. వెలుగులోకి హిల్లరీ క్లింటన్ పేరు..

ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘భారత్ మరో మైలురాయిని సృష్టించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ, ఆదిత్య ఎల్1 దాని గమ్యాన్ని చేరుకుంది’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఎల్1 కక్ష్యలో చేరేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం దశల వారిగా అందులో ఉన్న రాకెట్లను మండించి విజయవంతంగా ఆర్బిట్ ఇన్సర్షన్ పూర్తి చేశారు.

‘‘అత్యంత సంక్లిష్టమైన మరియు సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను గుర్తించడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ ఫీట్‌ని మెచ్చుకోవడంలో దేశంతో పాటు నేను చేరాను. మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ యొక్క కొత్త సరిహద్దులను మేము కొనసాగిస్తాము’’ అంటూ ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు.

Exit mobile version