Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ నేత అధిర్ రంజర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు ఈ పార్టీని ఇరుకున పెట్టాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఓటేయడం కన్నా బీజేపీకి ఓటేయడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా అధిర్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. టీఎంసీ వేసే ప్రతీ ఓటు హాని కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీకి తకూడా తెలుసని అన్నారు. అయితే అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. తాను ఇంకా ఈ వీడియో చూడలేదని అన్నారు.
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బర్హంపూర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అధిర్ రంజన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తును నిర్ణయించే, లౌకిక శక్తులకు ఓటేయాలని ప్రజల్ని కోరారు. ‘‘కాంగ్రెస్, వామపక్షాలు గెలవడం అవసరం, అలా చేయకపోతే లౌకికవాదం ప్రమాదంలో పడుతుంది. టీఎంసీ ఓటేయడం కన్నా బీజేపీ ఓటేయడం మంచిది. బీజేపీకి, టీఎంసీలకు ఓటు వేయకండి’’ అని బెంగాలీ భాషలో అన్నారు.
Read Also: Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పాక్ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్‌తో లింక్..
అధీర్ రంజన్ వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ..‘‘ నేను ఆ వీడియోను చూడలేదు. అతను ఏ సందర్భంలో ఇలా చెప్పాడో తెలియదు. అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ లక్ష్యం మాత్రమే ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. 2019లో కన్నా బీజేపీకి వచ్చే సీట్లు తగ్గించాలి’’ అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ ఉన్నాయని, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇందులో భాగమే అని జైరాం రమేష్ చెప్పారు.
అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీఎంసీల మధ్య సీట్ల ఒప్పందం కుదరలేదు. ఒక సందర్భంలో కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా ఎక్కువ గెలుస్తుందా..? అనే ప్రశ్నను మమతా బెనర్జీ లేవనెత్తారు. అధీర్ బీజేపీకి బీ-టీమ్ అని ఆమె ఆరోపించారు. బెంగాల్లో బీజేపీకి కళ్లు చెవులుగా వ్యవహరించిన తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటేయమని బహిరంగంగా అడుతుగుతున్నారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీకి బెంగాల్ విరోధి మాత్రమే ప్రచారం చేస్తారని ఆ పార్టీ మండిపడింది.