Actor Vijay: తమిళనాడులో మరో కొత్త పార్టీ వెలిసింది. తమిళ స్టార్ విజయ్ తన ‘‘తమిళగ వెట్రి కజగం (TVK)’’ తొలి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. విల్లుపురం జిల్లాలో విక్రవండీలో లక్షల మంది హాజరైన సభలో విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలు వివరించారు. తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే ‘‘తమిళ భాష’’కి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో పాటు గవర్నర్ వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేశారు.
విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను వెల్లడిస్తూ, ప్రాంతీయ వారసత్వాన్ని గౌరవించే సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం తమిళనాడులో తమిళాన్ని “కోర్టు ,దేవాలయ భాష”గా ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. పెరియార్ మా సైద్ధాంతిక నాయకుడని, మా పార్టీ అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తుందని, అయినప్పటికీ పెరియార్ సూచించిన మహిళా విద్యా, మహిళా సాధికారత, సామాజిక న్యాయం వంటి సూత్రాలను సమర్థిస్తామని చెప్పారు. ఈ విలువలను మేము ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
Read Also: Haryana-Rajasthan: హర్యానా-రాజస్థాన్ పోలీసుల మధ్య వార్.. కారణం ఇదే..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తమిళగ వెట్రి కజగం సైద్ధాంతిక నాయకుడని అన్నారు. బ్రిటీష్ వలస శక్తులను ఎదిరించిన మొదటి రాణి వేలు నాచ్చియార్, ప్రముఖ సామాజిక కార్యకర్త అంజలై అమ్మాళ్‌తో సహా తమిళనాడు చరిత్రలో మహిళా నాయకుల పట్ల తమ పార్టీకి ప్రత్యేక గౌరవం ఉందని విజయ్ అన్నారు
TVK యొక్క మానిఫెస్టో నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉంది:
*గవర్నర్ పదవిని తొలగించడం
*న్యాయస్థానాలలో తమిళాన్ని పరిపాలనా భాషగా ప్రచారం చేయడం
*మహిళలకు సమాన అవకాశాలు సాధించడం
*కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించడం
*రాష్ట్ర జాబితా కింద విద్యను పునరుద్ధరించడం