Shivaraj kumar: భార్యకు మద్దతుగా ప్రచారబరిలో శివన్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaraj kumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు తాను ప్రచారంలో పాల్గొంటా అని ఆయన బెళగావిలో చెప్పారు. తన భార్య కోసం ప్రచారం చేయాలని తన తోటి నటీనటులను అడగలేదని అన్నారు.
Read Also: Tamil Nadu: బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం.. అన్నామలై సమక్షంలో చేరిక
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
‘‘తాము గెలవడానికి వచ్చాము. ప్రచారంలో పాల్గొనాలని ఇతర నటీనటులను ఒత్తిడి చేయము. ఈసారి వేడి ఎక్కువగా ఉంది. వారు ఒత్తిడికి గురికాకూడదు. కానీ మేము పిలిస్తే వారు వస్తారు. దాన్ని అడ్వాంటేజ్‌గా మేం తీసుకోవాలని అనుకోవడం లేదు. మనం యాక్టర్లకు స్పేస్ ఇవ్వాలి’’ అని అన్నారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు.
శివరాజ్ కుమార్ భార్య గీత మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె. ఆమె సోదరుల్లో ఒకరు మధు బంగారప్పు రాష్ట్రమంత్రి కాగా, మరో సోదరుడు కుమార్ బంగారప్పు బీజేపీ పార్టీలో ఉన్నారు. బంగారప్ప కుటుంబాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారా..? అని మీడియా ప్రశ్నించగా.. బంగారప్పు కుటుంబాన్ని ఏకం చేయడానికి నేను ఎవరు..? అని, నేను అతడి అల్లుడిని, కొడుకును కాదని శివరాజ్ కుమార్ సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!