NTV Telugu Site icon

Suresh Gopi: మహిళా రిపోర్టర్‌పై చేయేసిన మళయాళ స్టార్ హీరో.. చివరకు..

Suresh Gopi

Suresh Gopi

Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ నాయకుడిగా ఉన్న సురేష్ గోపి తన ఎడమ చేతిని మహిళా జర్నలిస్ట్ భుజంపై వేశాడు. కేరళలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూగా గెలవకపోవడంపై సురేష్ గోపిని సదరు విలేకరి ప్రశ్నించారు. “లెట్ మి గివ్ ఎ ట్రై డియర్. లెట్స్ వెయిట్” అని ఆమె భుజం మీద చేయి వేసి ఆమెకి బదులిచ్చాడు. దీంతో రచ్చ మొదలైందిన సురేష్ గోపిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జర్నలిస్ట్ అసోసియేషన్ చెప్పింది. వెంటనే మహిళకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

Read Also: Israel-Hamas War: హమాస్ గట్టి ఎదురుదెబ్బ.. నావల్ కమాండర్, ఏరియల్ ఫోర్స్ చీఫ్‌ని హతం చేసిన ఇజ్రాయిల్..

ఈ వ్యవహారం కేరళలో సంచలనంగా మారడంతో సురేష్ గోపి ఫేస్‌బుక్ వేదికగా సదరు మహిళా జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. తాను జర్నలిస్టును ఆప్యాయంగా పలకరించానని, జీవితంలో నేనెప్పుడు బహిరంగంగా, మరేవిధంగా అనుచితంగా ప్రవర్తించలేదని, ఆమెకు బాధ, మానసిక క్షోభ కలిగితే క్షమాపణలు కోరుతున్నా, క్షమించండి, ఒక తండ్రిగా క్షమాపణలు చెబుతున్నా అంటూ ఆయన మళయాలంలో పోస్ట్ చేశారు.

రాజ్యసభ మాజీ ఎంపీ అయిన గోపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ స్థానంపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో త్రిసూర్ స్థానం నుండి పోటీ చేశాడు, కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. అప్పటి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి తన పార్టీని గెలిపించేలా కృషి చేస్తున్నారు.

Show comments