Actor Darshan Case: దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకి మగబిడ్డ..

  • దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకు మగబిడ్డ..
  • రేణుకాస్వామి చనిపోయే సమయానికి ఐదు నెలల గర్భిణి..
  • తన కొడుకే మనవడిగా పుట్టాడని రేణుకాస్వామి తండ్రి కన్నీరు..
Renuka Swamy

Renuka Swamy

Actor Darshan Case: కన్నడ యాక్టర్ దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడం ఈ ఏడాది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా తన అనుచరులతో కలిసి కొట్టి చంపాడు. ఈ కేసులో దర్శన్ ప్రియురాలిగా చెప్పబడుతున్న పవిత్రా గౌడతో పాటు పలువురు నిందితులు జైలులో ఉన్నారు. పవిత్రా గౌడను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడనే ఆరోపణలపై రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూర్ తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి చంపారు.

Read Also: Viral News: ఏఐ ద్వారా సీవీని రూపొందించిన నిరుద్యోగి.. దాన్ని చూసి కంపెనీ సీఈవో షాక్..

×
×
Ad

ఇదిలా ఉంటే, రేణుకాస్వామి భార్య సహానా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రేణుకాస్వామి చనిపోయే సమయానికి సహానా 5 నెలల గర్భవతి. ఈ రోజు ఉదయం చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రి సహానాకు ఉచితంగా వైద్య చికిత్స అందించింది. రేణుకాస్వామి తండ్రి కాశీ నాథయ్య మనవడు పుట్టిన సమయంలో, తన కొడుకు లేడని తలుచుకుంటూ విలపించాడు. రేణుకా స్వామి మళ్లీ జన్మించినట్లు ఉందని కుటుంబీకులు మీడియాతో చెప్పారు.

జూన్ 09న బెంగళూర్‌లోని సుమనహళ్లీలోని ముగురునీటి కాలువలో 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. జూన్ 11న దర్శన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నివేదికలో రేణుకాస్వామి ఒంటిపై మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు అతని ప్రైవేట్ పార్టుల్లో గాయాల కారణంగా మరణించినట్లు చెప్పింది.