NTV Telugu Site icon

Chennai: అవినీతి రాణి.. మహిళా ఇన్‌స్పెక్టర్ కహానీ..

Chennai

Chennai

Chennai: అవినీతిని నిర్మూలించాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి కొంతమంది వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ భారీ అవినీతికి తెరలేపింది. అయితే ఆమె అవినీతిపై మొత్తం పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. వారి మొప్పు పొందుతూనే.. మరోవైపు లంచాల రూపంలో భారీగా ఆస్తులు కూడబెట్టింది. చివరకు విచారణలో దొరికి ఉద్యోగం పోగొట్టుకుంది.

Read Also: Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..

మహిళా ఇన్‌స్పెక్టర్ రాణి రోడ్డు ప్రమాదాల్లో బాధితుల నుంచి భారీగా లంచాలు తీసుకునేది. సదరు ఇన్‌స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ లేడీ ఇన్‌స్పెక్టర్ బాగోతంపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. విచారణ చేస్తే ఆమె అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు రాణిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంటులో చర్చనీయాంశంగా మారింది.

ఆమె అవినీతిపై ఉన్నతాధికారులు ఏడు నెలల సస్పెండ్ విధించగా.. తాజాగా ఆమెను మంగళవారం సర్వీస్ నుంచి తొలగించారు. ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో రాణి ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. గతేడాది ఆగస్టులో లంచం ఆరోపణతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆరోపణలపై తాంబరం పోలీస్ కమీషనర్ అమల్ రాజ్ విచారణకు ఆదేశించారు. లంచం కావాలని వేధిస్తోందంటూ ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ రాణి అవినీతి బయటకు వచ్చింది. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఆమె సొంతంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంది, బాధితుడితో ఒప్పందం కుదుర్చుకుని కేసు వాదించేలా చేసేది. బీమా సొమ్ములు రాగానే అందులోంచి డబ్బులు వసూలు చేసేది.

Show comments